Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ భామ ప్లేస్ లో శ్రియ

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
  • షూటింగులో జాయిన్ అయిన వెంకీ
  • చైతూ అత్త పాత్రలో శ్రియ
బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' సినిమా రూపొందుతోంది. క్రితం నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి చైతూ పైనే చిత్రీకరణ జరుపుతూ వచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో వెంకటేశ్ జాయిన్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో చైతూ జోడీగా రకుల్ నటిస్తోంది. వెంకటేశ్ సరసన కథానాయికగా హుమా ఖురేషిని అనుకున్నారు. ఆమెపై టెస్ట్ షూట్ కూడా చేశారు. కథ ప్రకారం ఆమె చైతూకి అత్తగా కనిపించవలసి ఉంటుంది. పాత్ర పరంగా చూసుకుంటే ఆమె సెట్ కావడం లేదనే ఉద్దేశంతో శ్రియను ఎంపిక చేసుకున్నారట. ఈ పాత్రకి శ్రియ సరిగ్గా సరిపోతుందనీ, ఆమె క్రేజ్ కూడా ఈ ప్రాజెక్టుకి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు. గతంలో వెంకటేశ్ సరసన కథానాయికగా ఆమె 'సుభాశ్ చంద్రబోస్' .. 'గోపాల గోపాల' సినిమాల్లో మెప్పించిన సంగతి తెలిసిందే.     
venkatesh
shriya
chaitu

More Telugu News